ఊహించని విజయాన్ని అందించారు

ABN , First Publish Date - 2023-10-18T02:57:33+05:30 IST

అభయ్‌ నవీన్‌, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేశ్‌, దయానంద్‌ రెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మాతలు...

ఊహించని విజయాన్ని అందించారు

అభయ్‌ నవీన్‌, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేశ్‌, దయానంద్‌ రెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మాతలు. ఇటీవలే విడుదలై మంచి టాక్‌ సంపాదించుకొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘‘మా సినిమాలో స్టార్స్‌ లేరు. కంటెంట్‌ని మాత్రమే నమ్ముకొన్నాం. అయినా సరే, ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ విజయం ఊహించలేద’’న్నారు. ‘‘వంద థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశాం. స్పందన బాగుండడంతో మరో 30 థియేటర్లు పెంచాం. నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ ఈ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింద’’ని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాతో తమ కెరీర్‌ మారిపోయిందని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-18T02:57:33+05:30 IST