ఊహించని స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి
ABN, Publish Date - Dec 24 , 2023 | 02:47 AM
నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డెవిల్’. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ కథానాయికలు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 29న...
నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డెవిల్’. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ కథానాయికలు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంగీత దర ్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ మీడి యాతో మాట్లాడారు.
‘డెవిల్’ సినిమా పాటలు, నేపథ్య సంగీతానికి చాలా చక్కటి స్పందన వస్తోంది. మేము ఊహించని స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి. సంగీతం సహజంగా ఉండాలని చాలా రీసెర్చి చేశాం. చాలా విదేశీ సంప్రదాయ వాద్య పరికరాలను వాడాం. అభిషేక్ నామా తలుచుకుంటే ఎవరితోనైనా సంగీతం చేయించుకోగలరు. కానీ నేను ‘యానిమల్’ చిత్రం కోసం పనిచేస్తూ బిజీగా ఉన్నా నాకోసం కొన్నాళ్లు ఆగారు. ఆయనకు సంగీతంపైన మంచి పట్టు ఉంది. మ్యూజిక్ సిట్టింగ్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు.
ఈ సినిమాకు కెమెరామాన్ సౌందరరాజన్ ప్రాణం పెట్టి పనిచేశారు. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వాటికి తగిన విధంగా ఆర్‌ఆర్ ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతిపాట కొత్తగా ఉండాలని కల్యాణ్‌రామ్ చెప్పారు. దానికి తగ్గట్లు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. ర్యాపర్ రాజకుమారి పాడిన పాట ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది.
‘డెవిల్’ చిత్రంలో కల్యాణ్‌రామ్ నట విశ్వరూపం చూస్తారు. ‘బింబిసార’ను మించేలా ఉంటుంది. సంయుక్త మీనన్ అద్భుతంగా నటించారు.
సందీ్‌పరెడ్డి వంగా టాలెంట్ చూసి, రచయితగా ఆయన దగ్గర రెండు సినిమాలకు పనిచేస్తానని చెప్పాను. భవిష్యత్తులో సంగీతం ప్రధానంగా సాగే చిత్రానికి దర్శకత్వం వహించాలని ఉంది. శివమణి గారి కథను తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాను.