కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చే ఏడాది రెండు సినిమాలు

ABN, First Publish Date - 2023-12-18T01:32:06+05:30

వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను అందుకొంటూ పాన్‌ ఇండియా హీరో గుర్తింపు సాధించారు అడివి శేష్‌. ప్రస్తుతం ‘గూఢచారి 2’తో పాటు శ్రుతీహాసన్‌తో ఓ చిత్రం...

వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను అందుకొంటూ పాన్‌ ఇండియా హీరో గుర్తింపు సాధించారు అడివి శేష్‌. ప్రస్తుతం ‘గూఢచారి 2’తో పాటు శ్రుతీహాసన్‌తో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేష్‌ మీడియాతో మాట్లాడారు.

  • 2023 మొత్తం ప్రిపరేషన్‌లోనే గడిచింది. ‘గూఢచారి 2’ తో పాటు శ్రుతీహాసన్‌తో కలసి చేస్తున్న చిత్రానికి రైటింగ్‌, పూర్వ నిర్మాణ పనుల కోసం చాలా పనిచేశాం. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి.

  • ‘గూఢచారి 2’ చాలా పెద్దస్థాయిలో తెరకెక్కుతోంది. ఐదు దేశాల్లో జరిగే కథ. శ్రుతీహాసన్‌తో చేస్తున్న సినిమాను తెలుగు, హిందీ... రెండు భాషల్లో విడివిడిగా షూట్‌ చేయబోతున్నాం. కొత్త జానర్‌లో తెరకెక్కుతోంది. మంచి ప్రేమకథ, యాక్షన్‌ అంశాలు మిళితమై ఉంటాయి.

  • నేను మంచి యాక్టర్‌ని, అద్భుతమైన రచయితను, కానీ అంతగొప్ప దర్శకుణ్ణి మాత్రం కాదు అనుకుంటాను. అందుకే నటన, రచనకే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ఈ రెండు చిత్రాల తర్వాత మరో రెండు సినిమాలు చేస్తున్నాను.

Updated Date - 2023-12-18T01:32:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!