బలగం చిత్రానికి రెండు అవార్డులు
ABN , First Publish Date - 2023-05-09T04:21:34+05:30 IST
ఈ యేడాది విడుదలైన చిత్రాల్లో మంచి వసూళ్లని, విమర్శకుల మెచ్చుకోళ్లనీ అందుకొన్న చిత్రం ‘బలగం’. పలు అంతర్జాతీయ వేదికలపై పురస్కారాలు సైతం దక్కించుకొంది...

ఈ యేడాది విడుదలైన చిత్రాల్లో మంచి వసూళ్లని, విమర్శకుల మెచ్చుకోళ్లనీ అందుకొన్న చిత్రం ‘బలగం’. పలు అంతర్జాతీయ వేదికలపై పురస్కారాలు సైతం దక్కించుకొంది. ఇప్పుడు స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ మెరిసింది. ఉత్తమ నటుడు (ప్రియదర్శి), ఉత్తమ సహాయ నటుడు (కేతిరి సుధాకర్ రెడ్డి) విభాగాల్లో అవార్డులు దక్కించుకొంది. వేణు ఎల్దిండి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. తెలంగాణ సంప్రదాయాల నేపథ్యంలో సాగే కథ ఇది. కావ్య కల్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు.