ఇరవై ఏళ్ల శ్రమ ఫలించింది

ABN , First Publish Date - 2023-12-13T03:20:05+05:30 IST

క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘చే’. ‘లాంగ్‌ లైవ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా...

ఇరవై ఏళ్ల శ్రమ ఫలించింది

క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘చే’. ‘లాంగ్‌ లైవ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. దీనికి దర్శకుడు వి.ఆర్‌. సభావత్‌ నాయక్‌ చేగువేరా గెటప్‌లో రావడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘తొమ్మిదో తరగతిలోనే ప్రపంచ విప్లవానికి ఐకాన్‌గా నిలిచే చేగువేరా గురించి తెలుసుకున్నా. అప్పటి నుంచి ఆయన బయోపిక్‌ తీయాలన్నది నా కల. కానీ చేతిలో డబ్బు లేదు. సపోర్ట్‌ లేదు. తోపుడు బండి మీద తినుబండారాలు అమ్ముతూ డబ్బు కూడగట్టాను. మధ్య మధ్యలో పవన్‌కల్యాణ్‌గారు చేగువేరా గురించి పరోక్షంగా నాకు గుర్తు చేశారు .నా ఇరవై ఏళ్ల శ్రమ ఫలించింది. చేగువేరా గౌరవానికి ఏ మాత్రం తగ్గకుండా ‘చే’ బయోపిక్‌ తీశాను. ఈ సినిమా ప్రచార చిత్రాలను చేగువేరా కుమార్తె డాక్టర్‌ అలైదా గువేరా స్వయంగా విడుదల చేసి అభినందించడం మా అందరికీ గర్వకారణం. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నా’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు రాయపాటి అరుణ, సీనియర్‌ జర్నలిస్టు ప్రభు, భరద్వాజ్‌, నటుడు మాణిక్‌, పబ్లిసిటీ డిజైనర్‌ వివారెడ్డి తదితరులు కూడా మాట్లాడి సభావత్‌ ప్రయత్నాన్ని అభినందించారు.

Updated Date - 2023-12-13T03:20:06+05:30 IST