టక్కర్ లవ్ స్టోరీ
ABN , First Publish Date - 2023-04-18T03:31:38+05:30 IST
సిద్దార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టక్కర్’. కార్తిక్ జి. క్రిష్ దర్శకుడు. దివ్యాంవ కౌశిక్ కథానాయకి. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో మే 26న విడుదల చేయనున్నారు...

సిద్దార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టక్కర్’. కార్తిక్ జి. క్రిష్ దర్శకుడు. దివ్యాంవ కౌశిక్ కథానాయకి. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో మే 26న విడుదల చేయనున్నారు. సోమవారం సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ‘టక్కర్’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘‘ప్రేమ, యాక్షన్, రొమాన్స్ మేళవించిన చిత్రమిది. అసలు ప్రేమే లేదని భావించే ఓ అమ్మాయికి ఓ అబ్బాయి దగ్గరవ్వడం.. వాళ్ల మధ్య ప్రేమ చిగురించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో, హీరోయిన్ పాత్రలు రెండూ కొత్తగా ఆవిష్కరించారు. సిద్దార్థ్ కొత్త ఇన్నింగ్స్‌కి ఈ సినిమాతో శ్రీకారం చుడుతున్నామ’’న్నారు నిర్మాత. అభిమన్యు సింగ్, యోగిబాబు, మునీశ్ కాంత్ తదితరులు నటించారు. సంగీతం: నివాస్ కె.ప్రసన్న.