Trisha with Kamal కమల్‌కు తోడుగా త్రిష

ABN , First Publish Date - 2023-09-13T00:26:05+05:30 IST

కమల్‌హాసన్‌ - మణిరత్నం కాంబోలో వచ్చిన ‘నాయకుడు’ ఓ క్లాసిక్‌. ఆ తరవాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇంతకాలానికి మళ్లీ జట్టు కట్టారు. కమల్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో...

Trisha with Kamal కమల్‌కు తోడుగా త్రిష

కమల్‌హాసన్‌ - మణిరత్నం కాంబోలో వచ్చిన ‘నాయకుడు’ ఓ క్లాసిక్‌. ఆ తరవాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇంతకాలానికి మళ్లీ జట్టు కట్టారు. కమల్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. కథానాయికగా త్రిష పేరు ఖరారు చేశారు. దుల్కర్‌ సల్మాన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జయం రవికి కూడా ఓ పాత్ర దక్కింది. తెలుగు నుంచి ఒకరిద్దరు స్టార్‌ హీరోలు కమల్‌ చిత్రంలో అతిథులుగా మెరిసే ఛాన్స్‌ ఉంది. రజనీకాంత్‌ సైతం ఓ మెరుపులాంటి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ‘విక్రమ్‌’తో కమల్‌ ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశారు. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’తో బిజీగా ఉన్నారు. కమల్‌ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే మణి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

Updated Date - 2023-09-13T00:26:05+05:30 IST