వియత్నాంలో ట్రైనింగ్‌

ABN , First Publish Date - 2023-09-08T02:11:36+05:30 IST

యువ కథానాయకుడు నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. యుద్ధ నేపథ్యంలో జరిగే ఈ చిత్రం కోసం నెల రోజుల పాటు వియత్నాంలో కఠినమైన శిక్షణను ఆయన పొందనున్నారు...

వియత్నాంలో ట్రైనింగ్‌

యువ కథానాయకుడు నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. యుద్ధ నేపథ్యంలో జరిగే ఈ చిత్రం కోసం నెల రోజుల పాటు వియత్నాంలో కఠినమైన శిక్షణను ఆయన పొందనున్నారు. గురువారం ఆయన వియత్నాం వెళ్లారు. అక్కడ ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటారు. సైగాన్‌లోని కొంతమంది స్టంట్‌ మాస్టర్లు, టీమ్స్‌ నిఖిల్‌కు శిక్షణ ఇస్తారు. అలాగే పాత్ర కోసం నిఖిల్‌ ఫిజికల్‌ మేకోవర్‌ కూడా అవుతున్నారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ఒక లెజెండరీ యోఽధుడిలా ఆయన కనిపించారు. ఇంతవరకూ నిఖిల్‌ పోషించిన పాత్రల్లో ఇదే ఛాలెంజింగ్‌ రోల్‌. ఆయనకు ఇది 20వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రానికి మాటలు: వాసుదేవ్‌ మునెప్పగారి, సంగీతం: రవి బస్రూర్‌, ఫొటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాతలు: భువన్‌, శ్రీకర్‌, రచన, దర్శకత్వం: భరత్‌ కృష్ణమాచారి.

Updated Date - 2023-09-08T02:11:36+05:30 IST