కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కన్నడ హీరో ఇంట్లో విషాదం

ABN, First Publish Date - 2023-08-08T03:33:46+05:30

కన్నడ హీరో విజయరాఘవేంద్ర భార్య స్పందన (43) బ్యాంకాక్‌లో గుండెపోటుతో మృతి చెందారు. మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి స్పందన ఐదు రోజుల క్రితం బ్యాంకాక్‌కు వెళ్లారు...

కన్నడ హీరో విజయరాఘవేంద్ర భార్య స్పందన (43) బ్యాంకాక్‌లో గుండెపోటుతో మృతి చెందారు. మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి స్పందన ఐదు రోజుల క్రితం బ్యాంకాక్‌కు వెళ్లారు. అందరితో కలిసి ఉన్న సమయంలో ఆదివారం గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలియగానే విజయరాఘవేంద్ర, ఆయన తమ్ముడు శ్రీమురళి, తండ్రి చెన్నేగౌడ, స్పందన తండ్రి, మాజీ ఐపీఎస్‌ అధికారి బీకే శివరాం తదితరులు బ్యాంకాక్‌కు బయలుదేరారు. క్రేజీస్టార్‌ రవిచంద్రన్‌ చిత్రం అపూర్వలో స్పందన నటించారు. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడికి చెందిన ఐపీఎస్‌ అధికారి బీకే శివరాం కుమార్తె స్పందన, నటుడు విజయరాఘవేంద్ర ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 2007 ఆగస్టు 26న పెళ్లి చేసుకున్నారు. వీరికి శౌర్య అనే కుమారుడు ఉన్నారు. బ్యాంకాక్‌ నుంచి స్పందన మృతదేహాన్ని బెంగళూరుకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌ ప్రకటించారు. మల్లేశ్వరంలోని శివరాం ఇంట విషాదఛాయలు అలుమకున్నాయి. పలువురు మాజీ ఐపీఎస్‌ అధికారులు శివరాం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆంధ్రజ్యోతి, బెంగళూరు

Updated Date - 2023-08-08T03:33:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!