కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atharva: ‘అథర్వ’కు టాలీవుడ్ క్రష్ శ్రీలీల సపోర్ట్

ABN, First Publish Date - 2023-11-09T23:36:23+05:30

కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అథర్వ. మహేష్ రెడ్డి దర్శకత్వంలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమాలోని మరో సాంగ్‌ని టాలీవుడ్ క్రష్ శ్రీలీల విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

Atharva Movie Song Still

కార్తీక్ రాజు (Karthik Raju), సిమ్రాన్ చౌదరి (Simran Chaudhary), ఐరా (Ayraa) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’ (Atharva). మహేష్ రెడ్డి (Mahesh Reddy) దర్శకత్వంలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి (Subhash Nuthalapati) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమాలోని మరో సాంగ్‌ని టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) విడుదల చేసి.. పాట చాలా బాగుందంటూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘చాంగు చాంగురే’ అంటూ సాగిన ఈ పాటకు శ్రీ చరణ్ పాకాల బాణీ.. కాసర్ల శ్యామ్ సాహిత్యం.. యామినీ ఘంటసాల గాత్రం.. భాను మాస్టర్ కొరియోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ పాట చూడటానికి.. అలాగే వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. (Changu Changure Song)


పాట విడుదల సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘సస్పెన్స్, క్రైమ్ జానర్లో మూవీ అంటే ఆడియన్స్‌కు ఎప్పుడూ ఓ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రెండు జానర్లకు రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జతపరిచి యూత్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించిన మూవీ ‘అథర్వ’. ఇప్పటి వరకు విడుదల చేసిన కంటెంట్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. టాలీవుడ్ క్రష్ శ్రీలీల మా సినిమా పాటను విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నాం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ప్రేక్షకులను కచ్చితంగా ఈ సినిమా అలరిస్తుంది’’ అని తెలిపారు. (Atharva Movie)

Updated Date - 2023-11-09T23:36:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!