కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు

ABN, First Publish Date - 2023-10-26T01:49:35+05:30

బుల్లితెర ప్రేక్షకులను అలరించి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్‌ వెండితెరపై హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నారు...

బుల్లితెర ప్రేక్షకులను అలరించి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్‌ వెండితెరపై హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. అరుణ్‌ విక్కిరాల దర్శకత్వంలో విజేష్‌, చిరంజీవి పి, వెంకటేశ్వర్లు కె నిర్మిస్తున్నారు. డాలీషా హీరోయిన్‌. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కాలింగ్‌ సహస్ర’ నిర్మాతలుగా మాకు తొలి అడుగు. సరికొత్త సుధీర్‌ను మా చిత్రంలో చూస్తారు. థ్రిల్‌ అంశాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె రాబిన్‌. సినిమాటోగ్రఫీ: సన్నీ డి.

Updated Date - 2023-10-26T01:49:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!