నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు
ABN , First Publish Date - 2023-10-26T01:49:35+05:30 IST
బుల్లితెర ప్రేక్షకులను అలరించి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపై హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నారు...
బుల్లితెర ప్రేక్షకులను అలరించి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపై హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో విజేష్, చిరంజీవి పి, వెంకటేశ్వర్లు కె నిర్మిస్తున్నారు. డాలీషా హీరోయిన్. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్ర’ నిర్మాతలుగా మాకు తొలి అడుగు. సరికొత్త సుధీర్‌ను మా చిత్రంలో చూస్తారు. థ్రిల్ అంశాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్. సినిమాటోగ్రఫీ: సన్నీ డి.