టిల్లుగాడి స్టైలే వేరు

ABN , First Publish Date - 2023-10-28T05:02:12+05:30 IST

సిద్దు జొన్నలగడ్డ పేరు వినగానే ‘డీజే టిల్లు’.. ఆ పాత్రతో ఆయన పండించిన వినోదమే గుర్తొస్తాయి. ఈ పాత్రతో మరోసారి నవ్వించడానికి టిల్లు సిద్ధమయ్యాడు. డీజే టిల్లుకి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘టిల్లు స్వ్కేర్‌’...

టిల్లుగాడి స్టైలే వేరు

సిద్దు జొన్నలగడ్డ పేరు వినగానే ‘డీజే టిల్లు’.. ఆ పాత్రతో ఆయన పండించిన వినోదమే గుర్తొస్తాయి. ఈ పాత్రతో మరోసారి నవ్వించడానికి టిల్లు సిద్ధమయ్యాడు. డీజే టిల్లుకి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘టిల్లు స్వ్కేర్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ‘‘డీజే టిల్లు ఇచ్చిన వినోదానికి డబుల్‌ వినోదం గ్యారెంటీ. టిల్లులో రాధిక పాత్ర ఎంతగా అలరించిందో, ఈ సీక్వెల్‌లో అనుపమ అంతగా ఆకట్టుకొంటుంది. తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. ప్రచార చిత్రాలూ ఆకట్టుకొంటున్నాయి. త్వరలో మరిన్ని విశేషాలు పంచుకొంటాం’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-10-28T05:02:12+05:30 IST