టిల్లు... టికెట్‌ కొనకుండా

ABN , First Publish Date - 2023-07-27T03:52:47+05:30 IST

‘టిల్లు అన్న డీజే పెడితే...’ అంటూ ‘డీజే టిల్లు’ చిత్రంతో యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’ రూపొందుతోంది...

టిల్లు... టికెట్‌ కొనకుండా

‘టిల్లు అన్న డీజే పెడితే...’ అంటూ ‘డీజే టిల్లు’ చిత్రంతో యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’ రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి ‘టికెట్‌ కొనకుండా’ అంటూ సాగే గీతాన్ని యూనిట్‌ విడుదల చేసింది. సంగీత దర్శకుడు రామ్‌ మిరియాల స్వరపరిచి, ఆలపించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ కథానాయిక. సాంగ్‌ ప్రోమోలో ఆమె లుక్‌, టిల్లుతో సంభాషణ చూస్తుంటే సినిమా సరికొత్త వినోదాన్ని అందించబోతోందని తెలుస్తోంది. మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-07-27T03:52:47+05:30 IST