సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

టిల్లుతో... మామూలుగా ఉండదు

ABN, First Publish Date - 2023-06-06T02:10:20+05:30

‘అట్లుంటది మనతోని..’ అంటూ ‘డీజే టిల్లు’తో సిద్దు జొన్నలగడ్డ చేసిన హంగామా మామూలుగా పండలేదు. చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయాన్ని అందుకొంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అట్లుంటది మనతోని..’ అంటూ ‘డీజే టిల్లు’తో సిద్దు జొన్నలగడ్డ చేసిన హంగామా మామూలుగా పండలేదు. చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్వ్కేర్‌’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 15న విడుదల చేయనున్నట్టు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటు సిద్దు– అనుపమల రొమాంటిక్‌ పోస్టర్‌ని సైతం విడుదల చేశారు. ‘‘డీజే టిల్లు అందించిన వినోదం ఈసారి రెట్టింపు అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని తప్పకుండా అందుకొంటామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రానికి రామ్‌ మిరియాల, శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Updated Date - 2023-06-06T02:10:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!