Tiger Nageswara Rao gave satisfaction as an actor : నటుడిగా టైగర్‌ నాగేశ్వరరావు సంతృప్తిని ఇచ్చింది

ABN , First Publish Date - 2023-10-23T01:27:25+05:30 IST

‘విక్రమ్‌ రాథోడ్‌ తర్వాత నాకు నటుడిగా మళ్లీ అంత సంతృప్తిని ఇచ్చిన పాత్ర ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు’ అని రవితేజ అన్నారు...

Tiger Nageswara Rao gave satisfaction as an actor : నటుడిగా టైగర్‌ నాగేశ్వరరావు  సంతృప్తిని ఇచ్చింది

‘విక్రమ్‌ రాథోడ్‌ తర్వాత నాకు నటుడిగా మళ్లీ అంత సంతృప్తిని ఇచ్చిన పాత్ర ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు’ అని రవితేజ అన్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారు. దర్శకుడు వంశీ కొత్త నటీనటులతోనూ అద్భుతంగా చేయించారు. నటీనటులు కన్నా ఆ పాత్రలే తెరమీద కనిపించాయి. టెక్నీషియన్ల అందరి సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింద’న్నారు. దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ ‘‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని, డైలాగ్‌ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. రవితేజ, అభిషేక్‌ గారి వలే ్ల ఇంత పెద్ద సినిమా చేయగలిగాను. ఇది ప్రేక్షకుల సినిమా. ప్రేక్షకులే ముందుకు తీసుకెళుతున్నారు’ అని చెప్పారు. అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్ట్‌ మొదలుకావడానికి కారణమైన వివేక్‌ గారిని ఎప్పటికీ మర్చిపోను. సినిమా షోలు, వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి’ అని తెలిపారు.

Updated Date - 2023-10-23T01:27:25+05:30 IST