టైగర్‌ దమ్‌

ABN , First Publish Date - 2023-09-06T03:31:05+05:30 IST

రవితేజ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టూవర్ట్‌పురం గజదొంద టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. నుపుర్‌ సనన్‌ రవితేజకు జోడీగా నటిస్తున్నారు...

టైగర్‌ దమ్‌

రవితేజ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టూవర్ట్‌పురం గజదొంద టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. నుపుర్‌ సనన్‌ రవితేజకు జోడీగా నటిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 20న విడుదలవుతోంది. ఈ సినిమాలోని తొలి గీతాన్ని చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. ‘ఏక్‌ దమ్‌ ఏక్‌ దమ్‌’ అంటూ సాగే ఈ హుషారైన రెట్రో గీతానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్‌ ఇచ్చారు. భాస్కర భట్ల సాహిత్యం అందించగా, అనురాగ్‌ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గీతంలో రవితేజ తన ప్రేయసి నుపుర్‌ సనన్‌ను ఆటపట్టిస్తూ కనిపించారు. ట్రాక్‌లోని ఎనర్జిటిక్‌ బీట్స్‌కు సరిపోయేలా శేఖర్‌ మాస్టర్‌ ట్రెండీ హుక్‌స్టెప్‌ను క్రియేట్‌ చేశారు. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆర్‌ మదీ.

Updated Date - 2023-09-06T03:31:05+05:30 IST