థ్రిల్లర్ ‘ధీమహి’
ABN , First Publish Date - 2023-08-09T04:00:08+05:30 IST
సాహస్ పగడాల, నిఖితా చోప్రా జంటగా నటించిన ‘ధీమహి’ చిత్రం అన్ని కార్యక్రామలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది...

సాహస్ పగడాల, నిఖితా చోప్రా జంటగా నటించిన ‘ధీమహి’ చిత్రం అన్ని కార్యక్రామలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటే దర్శకత్వం వహించారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘చాలా కొత్తగా ఉండే చిత్రమిది. ఇది ఓ థ్రిల్లర్. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నాం. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామ’’న్నారు.