Three movies... three looks : మూడు సినిమాలు... మూడు లుక్కులు

ABN , First Publish Date - 2023-09-03T01:29:27+05:30 IST

శనివారం పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి అప్‌డేట్స్‌ మోత మోగింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’...

Three movies... three looks : మూడు సినిమాలు... మూడు లుక్కులు

శనివారం పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి అప్‌డేట్స్‌ మోత మోగింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఇందులో పవన్‌ మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి యూనిట్‌ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఖాకీ చొక్కా, గళ్ల లుంగీ ధరించి రక్తం అంటిన కత్తిని పట్టుకొని కనిపించారు. ఈ నెల 5 నుంచి తిరిగి షూటింగ్‌ ప్రారంభించనున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

  • పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ డ్రామా ‘ఓజీ’. ఈ చిత్రం గ్లింప్స్‌ను యూనిట్‌ విడుదల చేసింది. అర్జున్‌దాస్‌ వాయిస్‌ ఓవర్‌తో పవన్‌ కల్యాణ్‌ పాత్రను పరిచయం చేసిన తీరు, ఎస్‌. థమన్‌ నేపథ్య సంగీతం, స్టైలిష్‌ సినిమాటోగ్రఫీతో ఆద్యంతం కనువిందు చేసింది. ఈ నెలలో ‘ఓజీ’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రియాంక మోహన్‌ కథానాయిక. అర్జున్‌దాస్‌, శ్రీయా రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

  • పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం నుంచి పవన్‌ కల్యాణ్‌ లుక్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ఎరుపు రంగు దుస్తుల్లో సీరియస్‌ లుక్‌లో పవన్‌ కల్యాణ్‌ కనిపించారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. ఏ. ఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-03T01:29:39+05:30 IST