మూడు తరాల పందిరిమంచం

ABN , First Publish Date - 2023-02-10T00:09:23+05:30 IST

ఈవీ గణేశ్‌బాబు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘పందిరిమంచం’. సృష్టి డాంగే, కనిక కథానాయికలు. ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని ఇటీవల...

మూడు తరాల పందిరిమంచం

ఈవీ గణేశ్‌బాబు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘పందిరిమంచం’. సృష్టి డాంగే, కనిక కథానాయికలు. ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని ఇటీవల ‘గాడ్‌ ఫాదర్‌’ దర్శకుడు మోహన్‌ రాజా విడుదల చేశారు. సిద్ద్‌ శ్రీరామ్‌ పాడిన పాట ఇది. శ్రీకాంత్‌ దేవా సంగీతాన్ని అందించారు. ‘‘మూడు తరాల కథ ఇది. వినోదాత్మకంగా సాగుతుంది. తమిళంలో ‘కట్టిల్‌’ పేరుతో విడుదల చేశాం. బాక్సాఫీసు దగ్గర వసూళ్లతో పాటు, అవార్డులు, రివార్డులూ సొంతం చేసుకొంది. తెలుగులోనూ మంచి విజయాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉంద’’న్నారు గణేశ్‌ బాబు.

Updated Date - 2023-02-10T00:09:53+05:30 IST