ఒకేసారి మూడు..!

ABN , First Publish Date - 2023-04-18T03:18:06+05:30 IST

టాలీవుడ్‌లోకి మరో కొత్త నిర్మాణ సంస్థ అడుగు పెట్టింది. అదే.. ‘రెడ్డీస్‌ మల్టీప్లెక్స్‌’. ఒకేసారి మూడు సినిమాల్ని ప్రకటించి, అందులో రెండు చిత్రాలకు సోమవారం క్లాప్‌ కొట్టడం విశేషం...

ఒకేసారి మూడు..!

టాలీవుడ్‌లోకి మరో కొత్త నిర్మాణ సంస్థ అడుగు పెట్టింది. అదే.. ‘రెడ్డీస్‌ మల్టీప్లెక్స్‌’. ఒకేసారి మూడు సినిమాల్ని ప్రకటించి, అందులో రెండు చిత్రాలకు సోమవారం క్లాప్‌ కొట్టడం విశేషం. ప్రొడక్షన్‌ నెం.1గా... ‘సోషల్‌ వర్కర్స్‌’ చిత్రం మొదలైంది. ఈ చిత్రానికి ప్రసాద్‌ దర్శకుడు. రెండో చిత్రానికి ‘కోబలి’ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రానికి మహేందర్‌ రెడ్డి దర్శకుడు. ఈ రెండు చిత్రాలకూ ప్రముఖ నటుడు బాబూ మోహన్‌ క్లాప్‌నిచ్చారు. మూడో చిత్రంగా ‘హ్యాపీ ఉమెన్స్‌ డే’ని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. నిర్మాత విజయ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘అన్ని భాషల్లోనూ విజయవంతమైన చిత్రాల్ని తెరకెక్కించాలన్న ప్రణాళికతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. ఒకేసారి 20 సినిమాల్ని మొదలుపెడుతున్నాం. ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడమే మా లక్ష్యం’’ అన్నారు.

Updated Date - 2023-04-18T03:18:08+05:30 IST