కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోపీచంద్‌తో ఆ ఇద్దరు

ABN, First Publish Date - 2023-08-11T02:43:45+05:30

గోపీచంద్‌ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష రూపొందిస్తున్న చిత్రం ‘భీమా’. గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు...

గోపీచంద్‌ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష రూపొందిస్తున్న చిత్రం ‘భీమా’. గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మలను ఎంపిక చేసినట్లు నిర్మాత కె.కె. రాధామోహన్‌ వెల్లడించారు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కుటుంబ భావోద్వేగాలు, ఇతర ఆంశాలతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘భీమా’ రూపొందుతోంది. ఈ చిత్రానికి మాటలు: అజ్జు మహంకాళి, సంగీతం: రవి బస్రూర్‌, ఫొటోగ్రఫీ: స్వామి గౌడ, ఎడిటింగ్‌: కిరణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రమణ వంక.

Updated Date - 2023-08-11T02:43:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!