ఈసారి థ్రిల్లర్‌ కథతో..!

ABN , First Publish Date - 2023-10-13T00:48:05+05:30 IST

బాక్సాఫీసు దగ్గర తొలి హిట్టు రుచి చూడడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు అఖిల్‌. లవ్‌ స్టోరీ, యాక్షన్‌ కథలు, ఫ్యామిలీ డ్రామా ఇలా రకరకాల కథలు ట్రై చేశాడు. కానీ వర్కవుట్‌ కాలేదు...

ఈసారి థ్రిల్లర్‌ కథతో..!

బాక్సాఫీసు దగ్గర తొలి హిట్టు రుచి చూడడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు అఖిల్‌. లవ్‌ స్టోరీ, యాక్షన్‌ కథలు, ఫ్యామిలీ డ్రామా ఇలా రకరకాల కథలు ట్రై చేశాడు. కానీ వర్కవుట్‌ కాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొన్న ‘ఏజెంట్‌’ దారుణంగా నిరాశ పరిచింది. దాంతో కొంత గ్యాప్‌ తీసుకొన్నాడు. ఇప్పుడు ఓ థ్రిల్లర్‌ కథని ఎంచుకొన్నాడు. ‘విరూపాక్ష’తో ఆకట్టుకొన్న దర్శకుడు కార్తీక్‌ దండు. ఇప్పుడు అఖిల్‌ కోసం ఓ కథ సిద్ధం చేశారు. ఈ కథ అఖిల్‌కి బాగా నచ్చడంతో పచ్చజెండా ఊపేశారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దసరా సందర్భంగా లాంఛనంగా మొదలెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కథానాయిక కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది. ఓ బాలీవుడ్‌ తార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ వుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Updated Date - 2023-10-13T00:48:05+05:30 IST