ఈ సారి కొత్త జానర్‌లో వస్తున్నా

ABN , First Publish Date - 2023-11-22T00:09:43+05:30 IST

సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. అరుణ్‌ విక్కిరాల దర్శకత్వంలో విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు...

ఈ సారి కొత్త జానర్‌లో వస్తున్నా

సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. అరుణ్‌ విక్కిరాల దర్శకత్వంలో విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. డాలీషా కథానాయిక. డిసెంబర్‌ 1న విడుదలవుతోంది. మంగళవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సుధీర్‌ మాట్లాడుతూ ‘ఈ సారి కొత్తగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌ లో రాబోతున్నాను. మార్క్‌ కే రాబిన్‌, గ్యారీ రావడం మా సినిమా స్థాయిని పెంచింది. సినిమా నచ్చితే పదిమందికి చెప్పండి’ అని కోరారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నా కథ సుధీర్‌ వల్ల చాలామందికి వెళుతుంది. ఇప్పటి వరకూ ఇలాంటి కథతో సినిమా రాలేదు’ అని చెప్పారు. సుధీర్‌ నటన ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ అని నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-11-22T00:09:45+05:30 IST