సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ విజయం ఊహించలేదు

ABN, First Publish Date - 2023-07-23T02:55:24+05:30

‘‘సామజవరగమన తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలుసు. కానీ ఈ స్థాయి విజయాన్ని అస్సలు ఊహించలేదు. బాక్సాఫీసు దగ్గర వసూళ్లు చూసి నేనే షాకయ్యా’’ అన్నారు రాజేశ్‌ దండా...

‘‘సామజవరగమన తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలుసు. కానీ ఈ స్థాయి విజయాన్ని అస్సలు ఊహించలేదు. బాక్సాఫీసు దగ్గర వసూళ్లు చూసి నేనే షాకయ్యా’’ అన్నారు రాజేశ్‌ దండా. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘సామజవరగమన’. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది. ఈ సందర్భంగా శనివారం రాజేశ్‌ దండా హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘కథ విన్నప్పుడే నాకు బాగా నచ్చింది. దర్శకుడు ఏదైతే చెప్పాడో అదే తీశాడు. శ్రీవిష్ణు, నరేశ్‌ పాత్రలు బాగా పేలాయి. నేను పంపిణీదారుడిగానే పరిశ్రమలోకి అడుగుపెట్టా. అందుకే ఈ సినిమాని సొంతంగా విడుదల చేశా. నేను తీసుకొన్న అత్యుత్తమ నిర్ణయాల్లో అదొకటి. మా సంస్థ నుంచి ‘ఊరి పేరు భైరవ కోన’ త్వరలోనే విడుదల కానుంది. ఇదో విభిన్నమైన ప్రయత్నం. ఈ చిత్రంపై కూడా నాకు గట్టి నమ్మకం ఉంద’’న్నారు.

Updated Date - 2023-07-23T02:55:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!