కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పార్టీ ఎక్కడ జరిగినా ఈ పాటే మోగాలి

ABN, First Publish Date - 2023-11-29T01:15:23+05:30

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హాయ్‌.. నాన్న’. శౌర్యువ్‌ దర్శకుడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఓ ప్రత్యేక గీతంలో శ్రుతిహాసన్‌ సందడి చేయనున్నారు...

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హాయ్‌.. నాన్న’. శౌర్యువ్‌ దర్శకుడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఓ ప్రత్యేక గీతంలో శ్రుతిహాసన్‌ సందడి చేయనున్నారు. ‘ఓడియమ్మ’ అంటూ సాగే ఈ పార్టీ గీతాన్ని మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వర పరచిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్‌ రాశారు. ధ్రువ్‌ విక్రమ్‌, శ్రుతిహాసన్‌, చిన్మయి శ్రీపాద ఆలపించారు. పాట మధ్యలో ‘తాగితే మర్చిపోగలను.. కానీ తాగనివ్వరు’ అంటూ ‘దేవదాస్‌’లోని అక్కినేని మాటల్ని వాడుకోవడం సందర్భోచితంగా అనిపించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘ఈ అల్బమ్‌లోని అన్ని పాటలూ బాగా కుదిరాయి. ‘ఓడియమ్మ’ మంచి బీటున్న పార్టీ సాంగ్‌. ఈ డిసెంబరు 31న ఎక్కడ ఏ పార్టీ జరిగినా ఈ పాట తప్పకుండా ఉండాల్సిందే’’ అన్నారు. మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి నిర్మాతలు. డిసెంబరు 7న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2023-11-29T01:15:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!