ఈ సినిమా నా కోసం

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:10 AM

ఈ ఏడాది ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో రూ. వెయ్యికోట్ల విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారూఖ్‌ఖాన్‌. ‘డంకీ’ చిత్రంతో ముచ్చటగా మూడో విజయాన్ని అందుకోవడానికి ఆయన...

ఈ సినిమా నా కోసం

ఈ ఏడాది ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో రూ. వెయ్యికోట్ల విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారూఖ్‌ఖాన్‌. ‘డంకీ’ చిత్రంతో ముచ్చటగా మూడో విజయాన్ని అందుకోవడానికి ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం చక్కటి ప్రేక్షకాధరణతో కొన సాగుతోంది. షారూఖ్‌ చిత్రాలు సాధిస్తున ్న వసూళ్లు, అపజయం ఎరుగని దర్శకుడిగా పేరున్న రాజ్‌కుమార్‌ హిరాణి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం వల్ల ‘డంకీ’పైన అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కూడా సూపర్‌హిట్‌ అవుతుందా?, ‘డంకీ’ రూ. వెయ్యి కోట్ల వసూళ్లను అందుకుంటుందా అని ట్రేడ్‌ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే షారూఖ్‌ మాత్రం ‘డంకీ’ సినిమాను తానసలు వసూళ్ల కోణంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది తన మనసుకు నచ్చిన చిత్రమని చెప్పారు. ‘జవాన్‌’, ‘పఠాన్‌’ చిత్రాలు ప్రేక్షకుల కోసం చేసిన సినిమాలు అన్నారు. ‘డంకీ’ మాత్రం తన కోసం చేసిన చిత్రమని పేర్కొన్నారు. ఇది యాక్షన్‌ చిత్రం కాదు, కామెడీ ఎంటరై్ౖటనర్‌ అయినా ప్రేక్షకులకు నచ్చింద ని షారూఖ్‌ చెప్పారు.

Updated Date - Dec 22 , 2023 | 05:10 AM