నరేశ్‌ పెళ్లి కథ ఇది!

ABN , First Publish Date - 2023-03-25T02:55:27+05:30 IST

నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎ్‌స.రాజు దర్శకుడు. నరేశ్‌ నిర్మాత. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోంది. శుక్రవారం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు...

నరేశ్‌ పెళ్లి కథ ఇది!

నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎ్‌స.రాజు దర్శకుడు. నరేశ్‌ నిర్మాత. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోంది. శుక్రవారం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. కుటుంబ అనుబంధాలు, భార్యాభర్తల బంధం నేపథ్యంలో సాగే కథ ఇది. చిత్రీకరణ పూర్తయింది. జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఇటీవల నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ల పెళ్లి జరిగిపోయిందంటూ ఓ వీడియో సోషల్‌ మీడియలో చక్కర్లు కొట్టింది. అది రీల్‌ పెళ్లా? రియల్‌ పెళ్లా? అనే ఆసక్తికరమైన చర్చ నెట్టింట జరిగింది. దీన్ని బట్టి చూస్తే.. నరేశ్‌, పవిత్రలది రీల్‌ పెళ్లే అనేది స్పష్టం అవుతోంది. ‘మళ్లీ పెళ్లి’ ప్రచారం కోసమే ఆ వీడియోని వైరల్‌ చేశారన్నమాట.

Updated Date - 2023-03-25T02:55:29+05:30 IST