నా కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ ఇదే!

ABN , First Publish Date - 2023-11-28T06:21:19+05:30 IST

నితిన్‌ కథానాయకుడిగా వక్కతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. శ్రీలీల కథానాయిక. రాజశేఖర్‌ కీలక పాత్రధారి. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలు...

నా కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ ఇదే!

నితిన్‌ కథానాయకుడిగా వక్కతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. శ్రీలీల కథానాయిక. రాజశేఖర్‌ కీలక పాత్రధారి. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అందర్నీ ఎంటర్టైన్‌ చేయడానికి నేనూ, నితిన్‌ రెండేళ్లు కష్టపడ్డాం. ఒళ్లు దగ్గర పెట్టుకొని మరీ పని చేశాం. అందుకే ఇంత మంచి అవుట్‌పుట్‌ వచ్చింద’’న్నారు. నితిన్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో ఇది 31వ చిత్రం. ఇప్పటి వరకూ నేను చేసిన బెస్ట్‌ క్యారెక్టర్‌ ఇదే. వక్కంతం వంశీ రాసిన ‘కిక్‌’, ‘రేసుగుర్రం’, ‘టెంపర్‌’ చిత్రాల్లోని హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పాత్రని తీర్చిదిద్దారు. ప్రేక్షకుల్ని నవ్వించడమే మా గోలా. నాన్‌ స్టాప్‌గా నవ్విస్తాం. స్ర్కీన్‌ ప్లే కూడా కొత్తగా ఉంటుంది. మంచి డాన్స్‌ మూమెంట్స్‌ కుదిరి చాలా కాలం అయ్యింది. ఈ సినిమాలో ఆ ఛాన్స్‌ కూడా వచ్చింది. డిసెంబరు 8న హిట్‌ కొట్టబోతున్నాం.. రాసి పెట్టుకోండి’’ అన్నారు.

Updated Date - 2023-11-28T06:21:23+05:30 IST