కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Samantha : సమంతకు నచ్చిన సినిమా ఇదే!

ABN, First Publish Date - 2023-11-28T06:23:57+05:30

సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే కథానాయికల్లో సమంత పేరు తప్పకుండా ఉంటుంది. తన కొత్త సినిమా కబుర్లు, ఫ్యాషన్‌ ముచ్చట్లు, ఫిలాసఫీ ఇలా రకరకాల విషయాలపై సమంత తరచూ...

సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే కథానాయికల్లో సమంత పేరు తప్పకుండా ఉంటుంది. తన కొత్త సినిమా కబుర్లు, ఫ్యాషన్‌ ముచ్చట్లు, ఫిలాసఫీ ఇలా రకరకాల విషయాలపై సమంత తరచూ స్పందిస్తుంటుంది. ఇప్పుడు రివ్యూ రైటర్‌గానూ సరికొత్త అవతారం ఎత్తింది. తనకు నచ్చిన ఓ సినిమాపై ఓ చిన్నసైజు రివ్యూ ఇచ్చేసింది. ఈ యేడాది ఇదే అత్యుత్తమ చిత్రం అంటూ కితాబునూ అందించింది. సమంతకు అంతగా నచ్చిన ఆ సినిమానే.. ‘కాథల్‌ - ది కోర్‌’. మమ్ముటి, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ చిత్రమిది. జీయోబాబి దర్శకత్వం వహించారు. ఈ సినిమా చూసి, సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించింది సమంత. ‘‘ఈ సినిమా ఆద్యంతం అద్భుతంగా ఉంది. 2023లో ఇదే అత్యుత్తమ చిత్రం. అందరూ చూడాల్సిన శక్తిమంతమైన సినిమా ఇది. నా హీరో మమ్ముట్టి నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మంచి సినిమా చూస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఫీల్‌ నుంచి నేనింకా బయటకు రాలేకపోతున్నా’’ అంటూ ఓ రివ్యూ ఇచ్చేసింది సమంత.

Updated Date - 2023-11-28T06:33:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!