ఇదే నా ప్రేమ తీరం

ABN , First Publish Date - 2023-09-17T02:13:29+05:30 IST

నవదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్‌ మౌళి’. ప్రశాంత్‌ రెడ్డి తాటికొండ నిర్మాత. అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రం నుంచి ‘అందాలు చదివే కళ్లకైనా’ ...

ఇదే నా ప్రేమ తీరం

నవదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్‌ మౌళి’. ప్రశాంత్‌ రెడ్డి తాటికొండ నిర్మాత. అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రం నుంచి ‘అందాలు చదివే కళ్లకైనా’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. గోవింద వసంత స్వరాలు సమకూర్చారు. అనంత శ్రీరామ్‌ రాశారు. అనిస్‌ కృష్ణన్‌ ఆలపించారు. ‘‘మేఘాలయాలోని అందమైన లొకేషన్లలో ఈ పాటని తెరకెక్కించాం. నవదీప్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. ఆయన గెటప్‌ కొత్తగా ఉంటుంది. నవదీప్‌ 2.ఓని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-09-17T02:13:29+05:30 IST