ఇదొక విభిన్నమైన థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2023-11-17T02:56:49+05:30 IST

‘‘సాధారణంగా థ్రిల్లర్‌ చిత్రాలంటేనే విభిన్నంగా ఉంటాయి. ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’ చిత్రం ఇప్పటివరకూ వచ్చిన అన్ని థ్రిల్లర్స్‌ కంటే కొత్తగా ఉంటుంది’’...

ఇదొక విభిన్నమైన థ్రిల్లర్‌

‘‘సాధారణంగా థ్రిల్లర్‌ చిత్రాలంటేనే విభిన్నంగా ఉంటాయి. ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’ చిత్రం ఇప్పటివరకూ వచ్చిన అన్ని థ్రిల్లర్స్‌ కంటే కొత్తగా ఉంటుంది’’ అని హన్సిక అన్నారు. ఆమె లీడ్‌రోల్‌లో నటించిన చిత్రం ఇది. నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హన్సిక మీడియాతో ముచ్చటించారు. ‘తెలుగులో నాకు ఇది తొలి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ. ఎలాంటి ఫలితం వస్తుందో అని ఉత్కంఠగా ఉంది. మహిళలు, పిల్లల అక్రమ రవాణా గురించి మనందరం విన్నాం. కానీ మనుషుల చర్మంతో కూడా మాఫియా వ్యాపారం చేస్తుందనే విషయం ఇప్పటిదాకా సమాజంలో అంతగా హైలెట్‌ కాలేదు. కథ వింటున్నప్పుడు నాకు ఇదంతా కొత్తగా అనిపించింది. ఇందులో శ్రుతి అనే యువతిగా కనిపిస్తాను. ఆమె ఆర్గాన్‌ మాఫియా బారిన ఎలా పడింది? అందులోంచి బయటకు వచ్చేందుకు ఎలాంటి పోరాటం చేసింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథలో మలుపులు ఆకట్టుకుంటాయి’ అన్నారు.

Updated Date - 2023-11-17T02:56:52+05:30 IST