అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ ఇది!

ABN , First Publish Date - 2023-10-25T01:19:10+05:30 IST

సంపూర్ణే్‌షబాబు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. పూజ కొల్లూరు దర్శకురాలు. వెంకటేశ్‌ మహా ఈ చిత్రానికి స్ర్కీన్‌ ప్లే, సంభాషణలు సమకూర్చారు...

అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ ఇది!

సంపూర్ణే్‌షబాబు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. పూజ కొల్లూరు దర్శకురాలు. వెంకటేశ్‌ మహా ఈ చిత్రానికి స్ర్కీన్‌ ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఓ కీలకమైన పాత్రలోనూ నటించారు. ఈనెల 27న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంపూర్ణేష్‌ మాట్లాడుతూ ‘‘నేను ఎప్పుడో నేర్చుకొన్న నటనని గుర్తు చేసి, ఈ సినిమా కోసం నాలోని నటుడ్ని నిద్రలేపింది.. ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. ఇప్పటికే ఈ సినిమాని కొంతమందికి చూపించాం. వాళ్లకు బాగా నచ్చింది. ‘ఇన్నాళ్లకు నీకు సరైన సినిమా పడింది’ అని చాలామంది నాతో చెప్పారు. అందుకే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఓ సాధారణ వ్యక్తిగా, చెప్పులు కుట్టునేవాడిగా ఈ సినిమాలో నటించాను. ఈ సినిమా చేశాక సమాజం పట్ల నాకున్న బాధ్యత తెలిసింది’’ అన్నారు. ‘‘వైనాట్‌ స్టూడియో నుంచి ‘మండేలా’ రీమేక్‌ చేయాలన్న ఆఫర్‌ వచ్చింది. మొదట్లో నేను తిరస్కరించా. కానీ సినిమా చూశాక... ఇలాంటి కథ చెప్పాలనిపించింది. ప్రజాస్వామ్యం అమలులో ఉన్న ప్రతీ దేశంలోనూ ఇలాంటి సినిమాలు రావాలి. అన్ని భాషల్లోనూ ఈ కథ చెప్పాలి. అంతగా కదిలించింది’ అన్నారు వెంకటేశ్‌ మహా.

Updated Date - 2023-10-25T01:19:10+05:30 IST