ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌ ఇది

ABN , First Publish Date - 2023-11-22T00:26:03+05:30 IST

పంజా వైష్ణవ్‌తేజ్‌ నటించిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆదికేశవ’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో ముచ్చటిస్తూ చిత్రవిశేషాలు వెల్లడించారు వైష్ణవ్‌తేజ్‌...

ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌ ఇది

పంజా వైష్ణవ్‌తేజ్‌ నటించిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆదికేశవ’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో ముచ్చటిస్తూ చిత్రవిశేషాలు వెల్లడించారు వైష్ణవ్‌తేజ్‌-‘రంగరంగ వైభవంగా’ చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగవంశీ ఈ కథ వినమని చెప్పారు. కథ నాకు బాగా నచ్చేసింది. నాకు తెలిసిందల్లా కష్టపడి నిజాయతీగా పని చేయడం. ఫలితం గురించి ఆలోచించి చేయను. మొదటి సినిమా ‘ఉప్పెన’ కూడా అలాగే చేశాను. ఎవరు అడిగినా నేను నటుడిని అని చెబుతానే తప్ప హీరో అని చెప్నను. నేను చేసే కథల్లో కొత్తదనం ఉండాలి. అలాగే పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటాను. అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి.

  • ఇది పూర్తి స్థాయి మాస్‌ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్‌ ఎవరూ టచ్‌ చేయలేదని అనిపించింది. కామెడీ, సాంగ్స్‌, విజువల్స్‌, ఫైట్లు అన్నీ బాగుంటాయి. యాక్షన్‌ సన్నివేశాలు కూడా కథలో భాగంగా ఉంటాయి. వాటిని సాధ్యమైనంతవరకూ సహజంగానే చిత్రీకరించాం. నా వయసుకి తగ్గట్లుగానే ఫైట్స్‌ ఉంటాయి.

  • ఈ సినిమాలో శ్రీలీలకు, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్‌గా ఉంటాయి. సంభాషణలు సహజంగా, సరదాగా ఉంటాయి. ఎంతో ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ చేశాం. పాత్రలోని అమాయకత్వం, తింగరితనంతో దర్శకుడు శ్రీకాంత్‌ హాస్యం రాబట్టారు. అలాగే సీనియర్‌ నటి రాధికగారు సెట్‌లో ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆమె అందరితో కలసిపోయి సరదాగా ఉన్నారు. ఎంతో ఎనర్జిటిక్‌గా ఉన్నారు. అంతటి సీనియర్‌ ఆర్టి్‌స్టతో పని చేయడం సంతోషంగా అనిపించింది.

  • జోజు జార్జ్‌ చాలా స్వీట్‌ పర్సన్‌. అంత పెద్ద నటుడు, నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ అయినా డౌన్‌ టు ఎర్త్‌ అన్నట్లు ఉంటారు. ఆయన మంచి భోజన ప్రియుడు. పలనా ఫుడ్‌ బాగుంటుందట కదా అని అడిగేవారు. ఆయన్ని చూస్తే నాకు విజయసేతుపతిగారిని చూసినట్టే ఉంది.

Updated Date - 2023-11-22T00:26:07+05:30 IST