ఆనంద భాష్పాలు కురిపించే సినిమా ఇది

ABN , First Publish Date - 2023-12-01T00:41:39+05:30 IST

‘‘జనవరి మనందరి సినిమా పండగ. అయితే ఈ డిసెంబరులో సంక్రాంతి ముందే వచ్చేస్తోంది. ఈనెలంతా మంచి సినిమాలు రాబోతున్నాయి. అందులో ‘హాయ్‌ నాన్న’ కూడా...

ఆనంద భాష్పాలు కురిపించే సినిమా ఇది

‘‘జనవరి మనందరి సినిమా పండగ. అయితే ఈ డిసెంబరులో సంక్రాంతి ముందే వచ్చేస్తోంది. ఈనెలంతా మంచి సినిమాలు రాబోతున్నాయి. అందులో ‘హాయ్‌ నాన్న’ కూడా ఉంద’’న్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. డిసెంబరు 7న విడుదల అవుతోంది. ఇటీవల విశాఖపట్నంలో ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. నాని మాట్లాడుతూ ‘‘విశాఖ అంటే నాకు ప్రత్యేక అభిమానం. క్లాస్‌, మాస్‌ అనకుండా నా సినిమాల్నీ ఒకేలా ఆదరించారు. ‘ఈ సినిమాతో నాని ఏడిపించేస్తాడేమో’ అనే డౌటు వద్దు. కళ్లనిండా ఆనంద భాష్పాలు కురిపించే సినిమా ఇద’’న్నారు. ‘‘ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల అనుబంధం చాలా గొప్పగా చూపించారు. సినిమా మొదలైన కాసేపటికే వాళ్లతో ప్రేమలో పడిపోతార’’న్నారు మృణాల్‌ ఠాకూర్‌.

Updated Date - 2023-12-01T00:41:42+05:30 IST