కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం ఇది

ABN , First Publish Date - 2023-10-12T03:19:07+05:30 IST

సుహాస్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’. దుష్యంత్‌ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు..

కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం ఇది

సుహాస్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’. దుష్యంత్‌ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సుహాస్‌ మాట్లాడుతూ ‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి కారణం మా నిర్మాత దీరజ్‌ గారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌, ఎడిటింగ్‌... ఇలా ప్రతి విభాగం అద్భుతమైన ఔట్‌పుట్‌ ఇచ్చింది. నా కెరీర్‌లో ఎప్పటికీ మరపురాని చిత్రంగా ఇది నిలిచిపోతుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నాలాంటి కొత్తవాడికి దర్శకుడిగా జీఏ 2 పిక్చర్స్‌ బేనర్‌లో అవకాశం ఇచ్చిన నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీవాసు గారికి ధన్యవాదాలు. వారి ప్రోత్సాహంతోనే ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కించగలిగాను’ అన్నారు. హీరోయిన్‌ స్నేహితురాలి పాత్ర కోసం ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లాను, కానీ నన్నే హీరోయిన్‌గా తీసుకున్నారు అని శివానీ నాగరం తెలిపారు. దర్శకుడు మారుతి, హనూ రాఘవపూడి, శైలేష్‌ కొలను, సాయిరాజేశ్‌, సందీప్‌రాజ్‌, ప్రశాంత్‌, నిర్మాత ఎస్కేఎన్‌, చాయ్‌ బిస్కెట్‌ శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-12T03:20:49+05:30 IST