ఇది శుభ పరిణామం
ABN , First Publish Date - 2023-02-15T00:20:50+05:30 IST
చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు నిర్మాతలమండలి కార్యవర్గ ఎన్నికలు జరగడం చాలా ఆనందకరమైన శుభ పరిణామం అని సీనియర్ నిర్మాత కె.ఎ్‌స.రామారావు అన్నారు...
చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు నిర్మాతలమండలి కార్యవర్గ ఎన్నికలు జరగడం చాలా ఆనందకరమైన శుభ పరిణామం అని సీనియర్ నిర్మాత కె.ఎ్‌స.రామారావు అన్నారు. మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ‘కారణాలు ఏమైనా కావచ్చు.. పరిస్థితులు ఎటువంటివైనా ఉండొచ్చు. కానీ వాటిని నేను ఇప్పుడు ప్రస్తావించను. కొంతకాలంగా నిర్మాతలమండలి ప్రతిష్ట మనకబారి, దాదాపుగా దిగజారి పోయిందనే విమర్శలు వచ్చాయి. వాటి పట్ల పరిశ్రమలో అందరూ బాధ్యత వహించి, కౌన్సిల్‌కు, సినిమా పరిశ్రమకీ మళ్లీ పూర్వ ప్రతిష్టనీ, గౌరవాన్ని తీసుకురావాల్సిన చారిత్రక అవశ్యకత ఉంది. ఇందు కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లోనవకుండా, ఏ శక్తులకు ప్రభావితం కాకుండా ఆత్మ ప్రభోదాన్ని అనుసరించి ఓటు హక్కుని వినియోగించుకోవాలంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.