కొత్త ట్రెండ్ పరిచయం చేసే చిత్రమిది!
ABN , First Publish Date - 2023-08-04T03:01:43+05:30 IST
విక్రాంత్, మెహరీన్, రుక్సర్ థిల్లాన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. విక్రాంత్ దర్శకత్వం వహించారు. ఇటీవల హైదరాబాద్‌లో టీజర్ ఆవిష్కరించారు...

విక్రాంత్, మెహరీన్, రుక్సర్ థిల్లాన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. విక్రాంత్ దర్శకత్వం వహించారు. ఇటీవల హైదరాబాద్‌లో టీజర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కొన్నేళ్లుగా టాలీవుడ్ ట్రెండ్ మారింది. ‘స్పార్క్’ టీజర్ చూస్తే ‘శివ’ గుర్తొచ్చింది. ‘శివ’లానే టాలీవుడ్‌కు కొత్త ట్రెండ్ పరిచయం చేసే చిత్రం అవుతుందన్న నమ్మకం కలుగుతోంది. టైటిల్‌లోనే కాదు, హీరోలోనూ, సినిమాలోనూ ‘స్పార్క్’ కనిపిస్తోంద’’న్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ ‘‘విక్రాంత్ మా ఆఫీసుకు వచ్చినప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియో చూపించాడు. అప్పుడే అతనిలో విషయం ఉందని అర్థమైంది. హీరోగా నటిస్తూనే, దర్శకత్వం వహించడం అరుదైన విషయం’’ అన్నారు. ‘‘సినిమా ప్రేమికుడిగా ‘స్పార్క్’ని ప్రారంభించాను. ఈ కథ కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. అందులో కొన్ని మంచివి ఉన్నాయి. ఇంకొన్ని చెడ్డవీ ఉన్నాయి. చాలా పాజిటీవ్ మైండ్ సెట్‌తో, మంచి మనుషులతో తీసిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంద’’న్నారు విక్రాంత్.