ఈ ఘనత మా దర్శకుడిదే

ABN , First Publish Date - 2023-11-16T00:53:15+05:30 IST

‘‘ట్రైలర్‌ చూశాక ‘అథర్వ’ చిత్రం మీద ఆసక్తి పెరిగింది. పొలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానం చూసి ఆశ్చర్యపోయాను. ‘అథర్వ’ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర ఘన విజయం అందుకోవాలి’...

ఈ ఘనత మా దర్శకుడిదే

‘‘ట్రైలర్‌ చూశాక ‘అథర్వ’ చిత్రం మీద ఆసక్తి పెరిగింది. పొలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానం చూసి ఆశ్చర్యపోయాను. ‘అథర్వ’ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర ఘన విజయం అందుకోవాలి’ అని దర్శకుడు శశికిరణ్‌ తిక్క అన్నారు. కార్తీక్‌రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా జంటగా నటించిన చిత్రమిది. మహేశ్‌రెడ్డి దర్శకత్వంలో సుభాష్‌ నూతలపాటి నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 1న విడుదలవుతోంది. బుధవారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘ట్రైలర్‌లో చూపించినదానికన్నా సినిమాలో చాలా ఉంది. కార్తిక్‌ రాజు పాత్ర అద్భుతంగా ఉంటుంది. మా నిర్మాతలు నన్ను నమ్మి భారీ ఎత్తున నిర్మించారు’ అన్నారు. నిర్మాత సుభాష్‌ మాట్లాడుతూ ‘టీమ్‌ అంతా కష్టపడి మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. కార్తిక్‌రాజు మాట్లాడుతూ ‘క్లూస్‌ టీమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటిదాకా సినిమా రాలేదు. ఈ ఘనత మా దర్శకుడు మహేశ్‌రెడ్డికే దక్కుతుంద’న్నారు.

Updated Date - 2023-11-16T00:53:19+05:30 IST