ఆ ఊరి ఆత్మకథే ఈ చిత్రం
ABN , First Publish Date - 2023-10-12T03:17:22+05:30 IST
ప్రతి మనిషికీ ఆత్మ ఉంటుంది. అలాగే ఒక ఊరికి ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది?, దాని కథ ఏమిటి? అనేది మా ‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో చూపించాం అన్నారు దర్శకుడు మల్లి. శివ కంఠమనేని హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది...

ప్రతి మనిషికీ ఆత్మ ఉంటుంది. అలాగే ఒక ఊరికి ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది?, దాని కథ ఏమిటి? అనేది మా ‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో చూపించాం అన్నారు దర్శకుడు మల్లి. శివ కంఠమనేని హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. క్యాథలీన్ గౌడ్ హీరోయిన్. కే. ఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మల్లి మీడియాతో మాట్లాడారు.
ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొస్తారు. ఒక డిఫరెంట్ స్ర్కీన్‌ప్లే బేస్డ్ సినిమా చేద్దామనే ఆలోచనలోంచి ఈ సినిమా పుట్టింది. నా చిన్నతనంలో విన్న ఓ సంఘటన చుట్టూ కథను అల్లుకున్నాను. యాక్షన్, ఎమోషన్, కుటుంబ బంధాలు, మంచి లవ్‌స్టోరీ.. ఇలా అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన బలం. అనుకున్న విధంగా సినిమా తీయాలనే కొత్త నటీనటులను తీసుకున్నాను. సూరి పాత్రను శివ కంఠమనేని అద్భుతంగా పోషించారు. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొస్తారు.