సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

country loves only Khans : ఈ దేశం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది

ABN, First Publish Date - 2023-01-30T00:44:16+05:30

కంగనా రనౌత్‌ నోరు విప్పితే చాలు. వివాదం రాజుకొంటుంది. తన ముక్కుసూటితనంతో అనేకసార్లు వార్తల్లోకి ఎక్కిన కంగనా మరోసారి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

కంగనా రనౌత్‌ నోరు విప్పితే చాలు. వివాదం రాజుకొంటుంది. తన ముక్కుసూటితనంతో అనేకసార్లు వార్తల్లోకి ఎక్కిన కంగనా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ దేశం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుందంటూ వ్యంగ ధోరణిలో మాట్లాడింది. ఈమధ్యే షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్ర విజయాన్ని విశ్లేషిస్తూ ‘‘హిందువులు, ముస్లింలూ షారుఖ్‌ని సమానంగా ప్రేమిస్తారు. బహిష్కరణ వివాదాలు సినిమాకి సహాయం చేస్తాయి. రొమాన్స్‌, మంచి సంగీతం ఉంటే చాలు సినిమాలు ఆడతాయి. అందుకే భారత్‌ సెక్యులర్‌ దేశం’’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేసింది. దానికి కంగనా తనదైన శైలిలో స్పందించింది ‘‘చాలా మంచి విశ్లేషణ. ఈ దేశంలో చాలా సందర్భాలలో కేవలం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం హీరోయిన్లంటే మక్కువ చూపిస్తుంది. కాబట్టి ఈ దేశంలో ద్వేషం, పాసిజం ఉందని నిందలు వేయడం చాలా అన్యాయం. ప్రపంచంలో భారత్‌ లాంటి దేశం ఇంకోటి లేదు’’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు విసిరింది. కంగనా వాఖ్యలపై బాలీవుడ్‌లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ‘పఠాన్‌’ హిట్టవ్వడంతో కంగనా కుళ్లుకుంటోందని కొందరు విమర్శిస్తుంటే, కంగనా మాటల్లో ఎంతో కొంత నిజముందని ఇంకొందరు కంగనాకు మద్దతు పలుకుతున్నారు. ఖాన్‌లూ, ముస్లిం హీరోయిన్లకే పేరొస్తుందంటే నువ్వు కూడా పేరు మార్చుకో.. అంటూ కంగనాకు నెటిజన్లు ఉచిత సలహా పారేస్తున్నారు.

Updated Date - 2023-01-30T00:44:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!