ఈ దేశం గాంధీజీతో పాటు సుభాష్‌ చంద్రబో్‌సది కూడా

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:41 AM

వాస్తవ సంఘటన నుంచి ప్రేరణ పొంది తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రంలో వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటించారు...

ఈ దేశం గాంధీజీతో పాటు సుభాష్‌ చంద్రబో్‌సది కూడా

వాస్తవ సంఘటన నుంచి ప్రేరణ పొంది తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రంలో వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటించారు. యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా, విఎ్‌ఫఎక్స్‌ నిపుణుడిగా పేరొందిన శక్తి ప్రతా్‌పసింగ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ది ఫస్ట్‌ స్టైక్‌’ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్‌తేజ్‌ తన నటనతో, పవర్‌ఫుల్‌ డైలాగులతో ఆకట్టుకున్నారు. ‘ఈ దేశం గాంధీజీతో పాటు సుభాష్‌ చంద్రబో్‌సది కూడా’ అని శత్రువులకు గుర్తు చేసే డైలాగ్‌ అలరించింది. వందేమాతరం నేపథ్య సంగీతం ప్రేక్షకుల్లో దేశభక్తిని రేకెత్తిస్తోంది. మన వైమానిక దళ హీరోల ధైర్య సాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి సందీప్‌ ముద్దా నిర్మాత.

Updated Date - Dec 19 , 2023 | 12:41 AM