ఖాకీగా కదం తొక్కుతారు

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:25 AM

‘సలార్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకున్నారు ప్రభాస్‌. బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ ఘన విజయం ప్రభాస్‌ నటించే తదుపరి చిత్రం ‘స్పిరిట్‌’పై...

ఖాకీగా కదం తొక్కుతారు

‘సలార్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకున్నారు ప్రభాస్‌. బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ ఘన విజయం ప్రభాస్‌ నటించే తదుపరి చిత్రం ‘స్పిరిట్‌’పై అంచనాలను మరింత పెంచింది. ‘యానిమల్‌’ చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న సందీప్‌రెడ్డి వంగా దీనికి దర్శకుడు కావడం కూడా మరో కారణం. ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్రను సందీప్‌రెడ్డి ఎలా డిజైన్‌ చేయబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో సందీప్‌రెడ్డి సోదరుడు, ‘స్పిరిట్‌’ నిర్మాత ప్రణయ్‌రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ప్రభాస్‌ తన కెరీర్‌లో తొలిసారి ఈ చిత్రంలో ఖాకీ డ్రెస్‌ వేసుకోబోతున్నారు. ఆయన పాత్ర సందీప్‌ గత చిత్రాల్లో హీరోల పాత్రలనే పోలి ఉంటుంది. ఆవేశపరుడైన పోలీసాఫీసర్‌గా ప్రభాస్‌ అలరిస్తారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది’ అని తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 01:25 AM