వాళ్లు చెప్పారు.. నేనే వినలేదు

ABN , First Publish Date - 2023-04-13T03:31:27+05:30 IST

‘అగ్ర దర్శక ద్వయం రాజ్‌, డీకేలతో మళ్లీ పని చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన రాజీ పాత్రను వారు నాకు ‘ఫ్యామిలీ మేన్‌ 2’ సిరీ్‌సలో ఇచ్చారు...

వాళ్లు చెప్పారు.. నేనే వినలేదు

‘అగ్ర దర్శక ద్వయం రాజ్‌, డీకేలతో మళ్లీ పని చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన రాజీ పాత్రను వారు నాకు ‘ఫ్యామిలీ మేన్‌ 2’ సిరీ్‌సలో ఇచ్చారు. ఇప్పుడు ‘సిటడెల్‌’ సిరీస్‌లో మరో మంచి పాత్ర ఇచ్చారు’ అన్నారు సమంత. గ్లోబల్‌ స్పై డ్రామాగా ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మాడెన్‌ నటించిన అమెరికన్‌ వెర్షన్‌ ‘సెటడెల్‌’ కు ఇది ఇండియన్‌ ప్రాంచైజీ. వరుణ్‌ధావన్‌తో కలసి సమంత నటిస్తున్న ఈ సిరీస్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌తో రూపుదిద్దుకుంటోంది. బుధవారం నాడు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనారోగ్యం తనని ఇబ్బంది పెడుతున్నప్పటికీ యాక్షన్‌ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఎంజాయ్‌ చేశానని సమంత చెప్పారు. షూటింగ్‌లో గాయపడకుండా ప్రత్యేక జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్నారా అని అడిగితే ‘అవన్నీ నేను ఆలోచించలేదు. నా శక్తి మేరకు ఏం చెయ్యాలో అంతా చేశాను. ‘యాక్షన్‌ సీన్లను అంత తేలికగా తీసుకోవద్దు. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని నా సహ నటీనటులు చెప్పేవారు నేనే వినలేదు’ అని నవ్వేశారు సమంత. కొత్త ప్రాజెక్టుల గురించి అడిగితే ‘ప్రస్తుతం ‘సిటడెల్‌’, తెలుగు చిత్రం ‘ఖుషి’ మీదే దృష్టి పెట్టాను. ఇవి రెండూ పూర్తి చేయాలి. నా ఆరోగ్యం చూసుకోవాలి ’ అని చెప్పారు సమంత.

Updated Date - 2023-04-13T03:31:29+05:30 IST