మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ కుదిరింది

ABN , First Publish Date - 2023-11-10T02:19:53+05:30 IST

దినేశ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘అలా నిన్ను చేరి’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దినేశ్‌ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు...

మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ కుదిరింది

దినేశ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘అలా నిన్ను చేరి’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దినేశ్‌ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు.

  • తొలిసారిగా కమర్షియల్‌ రోల్‌ పోషించా. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ప్రతి మధ్యతరగతి యువకుడికి ఎదురయ్యే సమస్యలను ఇందులో చూపించాం. ప్రేమ ముఖ్యమా, లక్ష్యం ముఖ్యమా అనేది చిత్ర ముఖ్యాంశం. ఈ పాయింట్‌ నచ్చే సినిమా చేయడానికి అంగీకరించా. మంచి చిత్రం చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్‌ బయటకి వస్తారు.

  • ఈ చిత్ర దర్శకుడు మాఽరేశ్‌ శివన్‌ ‘హుషారు’ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సినిమా విడుదలైన ఏడాదికి నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పారు. నచ్చి వెంటనే ఓకే చెప్పేశా.

  • ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. హెబ్బా పటేల్‌ గురించి చెప్పనక్కరలేదు. అమె అద్భుతంగా నటించారు. హెబ్బా పాత్రతో ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్‌ అవుతారు. పాయల్‌ నటన గురించి ప్రేక్షకులు ఇప్పుడు తెలుసుకుంటారు. మా ముగ్గురి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది.

Updated Date - 2023-11-10T02:19:55+05:30 IST