ఊర మాస్‌ పాట వచ్చింది

ABN , First Publish Date - 2023-08-19T01:37:41+05:30 IST

రామ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘స్కంద’......

ఊర మాస్‌ పాట వచ్చింది

రామ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘స్కంద’. శ్రీలీల కథానాయిక. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. పాన్‌ ఇండియా స్థాయిలో నవంబరు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. శుక్రవారం ‘గందారబాయి’ అనే ఊర మాస్‌ పాటని విడుదల చేశారు. తమన్‌ స్వర పరిచిన ఈ గీతాన్ని నకాశ్‌ అజీజ్‌, సౌజన్య భాగవతుల ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య రీతులు అందించారు. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తమన్‌ స్వరకల్పనలో పాటలన్నీ బాగా వచ్చాయి. ‘గందారబాయి’ అయితే మాస్‌కి బాగా నచ్చేస్తుంది. ఈ పాటలో రామ్‌, శ్రీలీల వేసిన స్టెప్పులు మరింత ఆకర్షణగా నిలుస్తాయి. బోయపాటి స్టైల్‌లో సాగే కథ ఇది. నవంబరు 15 నుంచి థియేటర్లలో మాస్‌ హంగామా మొదలైపోతుంద’’న్నారు నిర్మాత.

Updated Date - 2023-08-19T01:37:41+05:30 IST