‘బేబీ’తో బ్రేక్‌ వచ్చింది

ABN , First Publish Date - 2023-07-23T03:02:06+05:30 IST

‘వారధి’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు విజయ్‌ బుల్గానిన్‌. మధ్యలో చాలా సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు. ‘బేబీ’తో ఒక్కసారిగా విజయ్‌ పేరు మార్మోగుతోంది....

‘బేబీ’తో బ్రేక్‌ వచ్చింది

‘వారధి’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు విజయ్‌ బుల్గానిన్‌. మధ్యలో చాలా సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు. ‘బేబీ’తో ఒక్కసారిగా విజయ్‌ పేరు మార్మోగుతోంది. ‘బేబీ’ విడుదలై, మంచి విజయాన్ని అందుకొన్న సందర్భంగా విజయ్‌ బుల్గానిన్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘బేబీలో నా పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. అల్లు అరవింద్‌, విజయ్‌ దేవరకొండ లాంటి వాళ్లు మెచ్చుకోవడం మరింత ఆనందంగా ఉంది. ఈ క్రెడిట్‌ అంతా సాయి రాజేశ్‌ గారిదే. లాక్‌ డౌన్‌ సమయంలో ఫోన్‌లో సాయి రాజేశ్‌ ‘బేబీ’ కథ చెప్పారు. వినగానే నేను కనెక్ట్‌ అయిపోయాను. ‘ప్రేమిస్తున్నా’ ట్యూన్‌ రెండు రోజుల్లో ఇచ్చేశా. ‘ఓ రెండు నీలి మేఘాలు’ పాటకూ ఎక్కువ టైమ్‌ తీసుకోలేదు. ఈ పాటని బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌లో ఎక్కువ వాడుకొన్నాం. నేపథ్య సంగీతానికీ ఎక్కువ మార్కులు పడుతున్నాయి. నాకు మెలోడీ అంటే ఇష్టం. మెలోడీ చేస్తే ఎలాంటి పాటైనా చేసేయొచ్చు. మున్ముందు కూడా మంచి సినిమాలతో ప్రయాణం చేయాలని ఉంద’’న్నారు.

Updated Date - 2023-07-23T03:02:06+05:30 IST