అప్పుడు చిరు.. ఇప్పుడు పవన్
ABN , First Publish Date - 2023-06-06T02:00:34+05:30 IST
‘వేర్ ఈజ్ ద పార్టీ.. బాసూ..’ అంటూ చిరంజీవితో స్టెప్పులు వేసిన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటాలా. ‘వాల్తేరు వీరయ్య’ కోసం ఐటెమ్ భామగా మారింది ఊర్వశి..

‘వేర్ ఈజ్ ద పార్టీ.. బాసూ..’ అంటూ చిరంజీవితో స్టెప్పులు వేసిన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటాలా. ‘వాల్తేరు వీరయ్య’ కోసం ఐటెమ్ భామగా మారింది ఊర్వశి. ఆ పాట బాగా క్లిక్ అయ్యింది. అప్పటి నుంచీ ఊర్వశికి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తన ఖాతాలో మరో ప్రత్యేక గీతం చేరింది. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ఈ చిత్రంలో ఓ పబ్ సాంగ్ ఉంది. ఆ పాటలో ఊర్వశి కనిపించనుంది. ఈ పాట మినహా చిత్రీకరణ దాదాపుగా పూర్తయిపోయింది. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అందులోనే త్వరలో చిత్రీకరణ మొదలవుతుంది. కేతిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. జులై 28న ‘బ్రో’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.