విధికి వారి నటనే ప్రత్యేకాకర్షణ

ABN , First Publish Date - 2023-11-01T03:17:40+05:30 IST

రోహిత్‌ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విధి’. శ్రీకాంత్‌ రంగనాథన్‌, శ్రీనాథ్‌ రంగనాథన్‌ ద్వయం దర్శకత్వం వహించగా రంజిత్‌ ఎస్‌ నిర్మించారు...

విధికి వారి నటనే ప్రత్యేకాకర్షణ

రోహిత్‌ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విధి’. శ్రీకాంత్‌ రంగనాథన్‌, శ్రీనాథ్‌ రంగనాథన్‌ ద్వయం దర్శకత్వం వహించగా రంజిత్‌ ఎస్‌ నిర్మించారు. నవంబర్‌ 3న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. రంజిత్‌ మాట్లాడుతూ ‘మా దర్శకుల విజన్‌ కొత్తగా ఉంది. శ్రీచరణ్‌ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. రోహిత్‌, ఆనంది నటన సినిమాకు హైలెట్‌’ అన్నారు. శ్రీకాంత్‌ రంగనాథన్‌ మాట్లాడుతూ ‘రంజిత్‌ వల్లే ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయగలిగాం. స్వయంగా మంచి కథలు రాసుకునేంత టాలెంట్‌ ఉన్నా మా మీద నమ్మకంతో ఈ సినిమాను మొదలుపెట్టారు’ అని చెప్పారు. ‘కథానుసారం సహజంగా నటించేందుకు చాలా హోమ్‌వర్క్‌ చేశాను, ఎక్స్‌ఎల్‌ యాప్‌ ద్వారా కంటిచూపు లేని వాళ్లు కూడా మా సినిమాను చూస్తున్న అనుభూతి పొందొచ్చు’ అని రోహిత్‌ నందా తెలిపారు. విధి చిత్రాన్ని సవాల్‌గా తీసుకొని సంగీతం అందించాను అని శ్రీచరణ్‌ చెప్పారు.

Updated Date - 2023-11-01T03:17:40+05:30 IST