తమ్ముడు దర్శకుడు.. అన్న హీరో!

ABN , First Publish Date - 2023-03-26T00:43:39+05:30 IST

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా రూపొందుతున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. అన్న హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తమ్ముడు దయానంద్‌ దర్శకత్వం వహిస్తుండడం విశేషం...

తమ్ముడు దర్శకుడు.. అన్న హీరో!

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా రూపొందుతున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. అన్న హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తమ్ముడు దయానంద్‌ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. రవి కస్తూరి ఈ సినిమాకు నిర్మాత. ఈ చిత్రం కోసం కిట్టు విస్సాప్రగడ రాసిన ‘పడిపోతున్నా’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. అనురాగ్‌ కులకర్ణి, హారికా నారాయణ్‌ పాడిన ఈ గీతానికి అశ్విన్‌-అరుణ్‌ సంగీతం అందించారు. చిత్రవిశేషాలను నిర్మాత వివరిస్తూ ‘అన్న హీరోగా నటించే సినిమాకు తమ్ముడు దర్శకత్వం వహించడం అరుదుగా జరుగుతుంటుంది. వారిద్దరూ వచ్చి నాకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీస్తున్నాను. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని చెప్పారు. రకరకాల ట్విస్టులతో సినిమా ఆసక్తిగా సాగుతుందనీ, యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌.. అంశాలు ప్రేక్షకులను అలరిస్తాయనీ దర్శకుడు చెప్పారు.

Updated Date - 2023-03-26T00:43:48+05:30 IST